Farmers Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు, ఘాజీపూర్, టిక్రి వద్ద భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ ఆంక్షలు తీవ్రమయ్యాయి. 5,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఢిల్లీ నగరంలో రైతుల ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ భద్రతా చర్యల అమలు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో ట్రాఫిక్‌ను ప్రభావితం చేసింది. సోమవారం ఉదయం ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగింది. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్రకర సంఘటన.. అప్పీల్ చేయలేదని..! వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్ర రైతు సంఘాలు మంగళవారం ‘మెగా మార్చ్’ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. 2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు పెట్టిన షరతుల్లో ఈ డిమాండ్ ఒకటి.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!