బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur) కుటుంబాన్ని ప్రధాని మోడీ (PM Modi) కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పలు విషయాలను ప్రధాని వారితో పంచుకున్నారు. వారితో కలిసి దిగిన ఓ ఫొటోను మోడీ ‘ఎక్స్’ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
కర్పూరీ ఠాకూర్‌ను జన్ నాయక్‌గా బీహార్ ప్రజలు పిలుచుకుంటారు. 1970 నుంచి 1971 వరకు.. అటు తర్వాత 1977 నుంచి 1979 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బీహార్ రాజకీయ ముఖ చిత్రంపై ఆయన చెరగని ముద్ర వేశారు.
సమాజంలోని వెనుకబడిన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతిలో కర్పూరీ ఠాకూర్ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆయన జీవితం తరతరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.
జనవరి 26, 2024న భారత ప్రభుత్వం కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను (Bharat Ratna) ప్రదానం చేసింది.
भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को निरंतर प्रेरित करता रहेगा। pic.twitter.com/Ihp7B08LXu
— Narendra Modi (@narendramodi) February 12, 2024