బుల్లెట్ రైలు (Bullet Train) గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ 3.0లో రాబోతుందంటూ పేర్కొన్నారు.
భారతీయులు ఎప్పుటి నుంచో బుల్లెట్ ట్రైన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణాలు చేయాలంటే ఒక్కోసారి రోజుల తరబడి సమయం పడుతోంది. అలాగని అందరూ విమానాల్లో ప్రయాణాల్లో చేయలేరు. ఇక త్వరగా గమ్యాలు చేరడానికి ప్రస్తుతానికి వందే భారత్ రైళ్లను ఉపయోగించుకుంటున్నారు. వీటి వల్ల సమయం ఆదా అవుతోంది. మరింత సమయం ఆదా కావాలంటే బుల్లెట్ ట్రైన్లతోనే సాధ్యం. కేవలం గంట వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లనుంది. దీంతో బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడు మనదేశంలో అడుగుపెడతాయా ? అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి చిన్న క్లూ వదిలారు. మోడీ ప్రభుత్వం 3.0 ఏర్పడగానే ప్రారంభమవుతాయని తెలిపారు.
గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముంబై – అహ్మదాబాద్ మధ్య 508 కిలీమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ కోసం 24 రివర్ బ్రిడ్జ్‌లు, 28 స్టీల్ బ్రిడ్జ్‌లు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్,12 స్టేషన్‌ల నిర్మాణం జరుగుతుంది.
सपने नहीं हकीकत बुनते हैं!
Stay tuned for #BulletTrain in Modi 3.0!#ModiKiGuarantee pic.twitter.com/0wEL5UvaY8— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 12, 2024