శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొత్త పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది.
CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇండియా కూటమి, ఆర్జేడీతో పొత్తుని తెంచుకుని ఇటీవల ఆయన మళ్లీ బీజేపీతో జతకట్టి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. 9వ సారి ముఖ్యమంత్రిగా బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్డీయేలోకి తిరిగి చేరిన తర్వాత తొలిసారిగా ఆయన ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
కర్ణాటక (Karnataka Congress) రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హీటెక్కాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్రం పన్నులను బదిలీ చేయడం లేదని.. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని వారు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, పొత్తులపై ఆయా పార్టీలు చర్చలు ముమ్మరం చేస్తున్నాయి.. ఏపీలో ఇప్పటికే బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని.. రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు కుదిరింది
ఇండియన్ టూరిస్టులకు ఇరాన్ సర్కార్ శుభవార్త చెప్పింది. భారతీయ పర్యాటకుల కోసం ఉచిత వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.