Matrimonial fraud: ఈ మధ్య మాట్రిమోనీ మోసాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. బయట పెద్దలు కుదిర్చే సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయికి మంచి భర్తను తీసుకురావాలని భావిస్తూ ఈ మాట్రిమోనీ వెబ్ సైట్లపై ఆధారపడుతున్నారు. మంచి ఉద్యోగం, ఆస్తులు, కార్లు, విల్లాలు ఉన్న వ్యక్తుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. తమకు దగ్గరి బంధువుల నుంచి వచ్చే అబ్బాయిలను అసలు పట్టించుకోవడమే లేదు.
ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ విదేశీ ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. టర్కీ, ఇథియోపియాలోని ప్రముఖ విదేశీ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి 100 మందికి పైగా మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
Sexual assault on girl: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగతనం చేయాలని ప్రవేశించిన బాలుడు అక్కడే పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పరారీలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను పట్టుకున్నారు. మెక్సికోలో పోలీసు అధికారులకు పట్టుబడిన దీపక్ బాక్సర్‌ను బుధవారం న్యూఢిల్లీకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
Delhi Hit And Drag Case: కొత్త సంవత్సరం తొలిరోజున ఢిల్లీలో యువతిని ఢీకొట్టి దాదాపుగా 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపుగా 13 కిలోమీటర్ల మేర కారుతో ఈడ్చుకెళ్లారు. కారు కింద చిక్కుకుపోయిన యువతి తీవ్ర గాయాలపాలై మరణించింది. ఈ కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. ఛార్జిషీట్ లో 117 మంది సాక్షులను చేర్చింది. ఐదుగురు…
Rahul Gandhi: మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ వ్యాఖ్యలపై ఆయన నుంచి వివరాలు కోరుతున్నారు పోలీసులు. ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని పోలీస్ టీం తుగ్లక్ లేన్ లో ఉన్న రాహుల్ ఇంటికి వెళ్లింది.
ఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసానికి ఆదివారం ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు” అనే వ్యాఖ్యకు సంబంధించి ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు ఆయన నివాసానికి చేరుకున్నారు.
Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కోర్టులో విస్తూపోయే నిజాలు చెబుతున్నారు. గతేడాది శ్రద్ధావాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చంపేసి అత్యంత దారుణంగా శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. కొన్ని రోజలు పాటు ఫ్రిజ్ లో నిల్వచేసి ఢిల్లీ శివారు ప్రాంతమైన మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశారు. శ్రద్ధావాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.