Sehar Shinwari : అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై పాక్ నటి సెహర్ షిన్వారీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని మోదీని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్‌ను ఆమె కోరారు. మన దేశంలో తీవ్రవాద ఆందోళనలు వ్యాప్తి చెందడానికి వారే కారణమని ఆమె ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లింక్ ఎవరికైనా తెలుసా? “ఇదంతా మన దేశంలో జరగడానికి నేను భారత ప్రధాని, ‘రా’ చీఫ్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను. భారత సుప్రీంకోర్టు నాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను’ అని ఆమె అన్నారు.
Read Also: Psycho Hulchul: అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి సైకో వీరంగం
దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ‘పాకిస్థాన్‌లో తమకు అధికార పరిధి లేదని, మీ దేశంలో ఇంటర్నెట్ లేనప్పుడు మీరు ఎలా ట్వీట్ చేస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మొబైల్ డేటా సేవలను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ హోంశాఖ ప్రకటించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లపై ఆంక్షలు ఉన్నాయని గ్లోబల్ ఇంటర్నెట్ మానిటర్ ‘నెట్ బ్లాక్స్’ వెల్లడించింది’. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగాయి. అనేక నగరాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసుల కాల్పులు, బాష్పవాయువు దాడులతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. చివరకు ఆందోళనకారులు ఆర్మీ అధికారుల ఇళ్లలోకి చొరబడి దోచుకున్నారు. చాలా చోట్ల పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Read Also:Unethical: తల్లితో సహజీవనం కూతురిపై వ్యామోహం.. పెంపుడు తండ్రిపై కడితో దాడి