Delhi Women Panel Chief Swathi Maliwal Seeks Action Against Man Shamelessly Masturbating On Metro: రానురాను మనుషులు బరి తెగించేస్తున్నారు. సిగ్గు శరం విడిచి.. బహిరంగ ప్రదేశాల్లోనే పాడు పనులకు పాల్పడుతున్నారు. చుట్టూ నలుగురున్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. జుగుస్పాకరమైన వ్యవహారాలకు తెగపడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి ఢిల్లీ మెట్రోలో అందరి ముందే పాడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పక్కనే యువతి, చుట్టుపక్కల జనాలు ఉన్నా.. ఏమాత్రం సిగ్గు లేకుండా ఆ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో బూతు వీడియోలు చూస్తూ, హస్తప్రయోగం చేశాడు. ఎదురుగా ఉన్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
Throat Cancer: ఓరల్ సెక్స్‌తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్ ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్రంగా స్పందించారు. ఆ వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నోటీసులు జారీ చేశారు. ‘‘ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి సిగ్గు లేకుండా హస్తప్రయోగం చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యంత జుగుస్పాకరంగా ఉంది. ఈ సిగ్గుమాలిన చర్యకు వ్యతిరేకంగా సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మెట్రోకు నేను నోటీసులు జారీ చేస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు, చుట్టుపక్కల ఉన్న వారు అతనిపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అసలు ఆ ట్రైన్‌లో ఉన్న జనాలు అతడ్ని ఏమీ అనకుండా మౌనంగా ఎందుకు ఉన్నారు? అతని వద్ద బాంబ్ లేదా హాని కలిగించే వస్తువులు ఏమైనా ఉన్నాయా? అదే ట్రైన్‌లో నేను లేదా నా కుటుంబ సభ్యులు ఉండి ఉంటే.. ఆ క్షణమే అతనికి తగిన బుద్ధి చెప్పేవాళ్లం. అతని ప్రైవేట్ పార్ట్ ముక్కలయ్యేదాకా కొట్టేవాళ్లం. ప్రభుత్వం కూడా అలాంటి చర్యలే తీసుకుంటుందని కోరుకుంటున్నా’’ అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డాడు.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
ఇదిలావుండగా.. కొన్ని రోజుల క్రితమే కేవలం బ్రా & మినిస్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో తిరిగిన ఒక అమ్మాయి వీడియో తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే! అది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ అమ్మాయి దుస్తులపై ప్రశ్నిస్తూ.. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరైతే.. చిట్టిపొట్టి దుస్తులు ధరించే బాలీవుడ్ తార ఉర్ఫీ జావెద్ స్ఫూర్తితో ఆ యువతి అలాంటి దుస్తులతో చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు. అప్పుడు ఆ యువతి అందుకు గట్టిగానే బదులిచ్చింది. తానేమీ పబ్లిసిటీ కోసం అలాంటి దుస్తులు ధరించడం లేదని, కొన్ని నెలల నుంచి తాను ఆ అవతారంలోనే ప్రయాణం చేస్తున్నానని కుండబద్దలు కొట్టింది. ఇతరుల అభిప్రాయాల్ని తాను ఏమాత్రం పట్టించుకోనని కూడా తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. సమాజంలో ఆమోదయోగ్యమైన సామాజిక మర్యాదలు, ప్రోటోకాల్స్‌ని అనుసరించాలని కోరింది.