Rishabh Pant on Delhi Capitals Playoffs: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఆడుంటే.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరేదన్నాడు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెబుతున్నా అన్నాడు. ఐపీఎల్ 2024లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ఆ మ్యాచ్లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకమైనది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే రెండు టీమ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 47 పరుగుల తేడాలో బెంగళూరు గెలుపొందింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. వికెట్ సాధించడంలో విజయం సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరోవైపు.. ఢిల్లీ బ్యాటింగ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ (57) అత్యధిక…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB Coach Mike Hesson on DC: ఈరోజు తమను ఓడించడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోందన్నాడు. సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుండటం తమకు కలిసొస్తుందని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్…
మే 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఆడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ లలో 5 గెలిచింది, ఇప్పుడు ప్లేఆఫ్ లకు అర్హత సాధించడానికి అవకాశం పొందడానికి తదుపరి 2 గేమ్ లను తప్పక గెలవాలి. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి చివరి 5 మ్యాచ్ లలో…
Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా…