Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్!
- 14 మ్యాచ్‌లలో 7 విజయాలు
- ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం
- నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Next Target is Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్ అని తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. ఐపీఎల్ 2024తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్.. విజయాలు కూడా అందించాడు. అయితే రెండో భాగంలో డీసీకి వరుస పరాజయాలు ఎదురవడంతో.. ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మొదటి బాధితుడిగా మారాడు. ఇక ఇప్పుడు పంత్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ వదిలేయనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Also Read: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
2025 సీజన్‌లో కొత్త కోచింగ్ బృందంతో బరిలోకి దిగాలని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తోంది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను మాత్రం కొనసాగించే అవకాశం ఉంది. డీసీకి టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్ పదవి కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రిషబ్ పంత్‌ను వదులుకుంటే.. ఢిల్లీకి కొత్త కెప్టెన్ వస్తాడు. ఢిల్లీ రిలీజ్ చేసిన చాలా మంది ప్లేయర్స్.. వేరే జట్లకు ఆడుతూ స్టార్స్ అయ్యారు. ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!