WPL 2025 Final: WPL 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 15)న ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో టేబుల్ పాయింట్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వరుసగా మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, తొలి రెండు సీజన్లలో ఢిల్లీ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ, ఈసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు తన శాయశక్తులా ప్రయత్నించనుంది. Read Also: Sunita Williams: నింగిలోకి…
అందరూ ఊహించిందే నిజమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అక్షర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తన ఎక్స్ ద్వారా తెలిపింది. ‘ఈరోజు కొత్త శకం ప్రారంభమంది’ అని పేర్కొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నా.. సారథ్యం తీసుకొనేందుకు అతడు మొగ్గు చూపలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిపోయిన విషయం…
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకుండా నిషేధం విధించింది. బ్రూక్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం. బ్రూక్‌పై నిషేధం ఐపీఎల్ 2025 నుంచే అమల్లోకి వస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్ 2027లో మరలా ఐపీఎల్‌లో ఆడవచ్చు. బీసీసీఐ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి తెలియజేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్…
KL Rahul: మార్చి 9న టీమిండియా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు మరో పది రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మొదలు కాబోతుంది. దీనితో మరో దాదాపు 50 రోజులపాటు క్రికెట్ అభిమానులకు సందడి షురూ కానుంది. ఇక ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. ఇందులో భాగంగా.. ఈ రోజు (గురువారం) ఉదయం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొట్టనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం సిద్దమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది.…
మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ…
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు.
WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌ను మెంటర్‌గా నియమించింది. ఫ్రాంచైజీ ఫిబ్రవరి 27 గురువారం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించిన ఆర్సీబీ, రెండో మ్యాచ్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించింది. సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచ్ ల గెలుపుతో ఆర్సీబీ టాప్ స్థానంలో నిలిచింది. Read Also: Delhi New CM:…