DC vs LSG: లక్నోపై ఢిల్లీ గెలుపు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ మొత్తం లక్నో వైపు తిరిగింది. కానీ.. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి రన్స్ కట్టడి చేశారు.
మరోవైపు.. లక్నో బ్యాటర్లలో మిగతా బ్యాటర్లంతా పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో లక్నో మ్యాచ్ ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (12), కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినీస్ (5) టాప్ ఆర్డర్ విఫలమయ్యారు. ఆ తర్వాత దీపక్ హుడా డకౌట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన ఆయూష్ బడోని (6) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (18), అర్షద్ ఖాన్ (58), యుద్ వీర్ సింగ్ (14), రవి బిష్ణోయ్ (2), నవీన్ ఉల్ హక్ (2) పరుగులు చేశారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Lucknow firing: ఇరువర్గాల ఘర్షణ.. తుపాకీతో కాల్పులు
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఢిల్లీ బ్యాటర్లలో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ డకౌట్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత.. క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్ (38) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టె్న్ రిషబ్ పంత్ (33) పరుగులతో రాణించాడు. చివర్లో స్టబ్స్, అక్షర్ పటేల్ (14) పరుగులు చేయడంతో.. లక్నో జట్టుకు భారీ స్కోరును నిర్దేశించారు. లక్నో బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో ఓ వికెట్ సంపాదించారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?