Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా తమ ఓటమికి ఓ కారణం అని గిల్ అంగీకరించాడు. ఢిల్లీపై గుజరాత్ బ్యాటర్లు…
Rishabh Pant React on DC Win vs GT: రసిక్‌దర్ సలామ్‌ను తాము నమ్మాలనుకున్నాం అని, ఆ ప్లాన్ వర్కౌట్ అయిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. అన్రిచ్ నోర్జ్ కఠిన సమయం ఎదుర్కొంటున్నాడని, అందుకే అతడికి బౌలింగ్ ఇవ్వకుండా రసిక్‌తో బౌలింగ్ వేయించాలని మ్యాచ్ మధ్యలోనే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో తాను సాధించే తొలి సిక్సర్ తనపై తనకు మరింత విశ్వాసాన్ని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠపోరు నడిచింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. చివరకు ఢిల్లీ గెలుపొందింది. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ సూపర్ గా ఆడినప్పటికీ గుజరాత్ ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటింగ్ లో వృద్ధిమాన్ సాహా (39), గిల్ (6), సాయి…
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ముందుగా టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
David Warner Runs For Aadhar Card: కరోనా మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతాఇంతా కాదు. తెలుగు, హిందీ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా హీరోలను అనుకరిస్తూ.. చేసే ఫన్నీ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీమంతుడు, అలా వైకుంఠపురంలో, పుష్ప, ఆర్ఆర్ఆర్, డీజే టిల్లు తదితర సినిమాల రీల్స్ ద్వారా అతడు చాలా ఫేమస్ అయ్యాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున…
Mitchell Marsh ruled out of IPL 2024: ఐపీఎల్ 2024లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. చీలమండ నొప్పికి చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మార్ష్.. తిరిగి భారత్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు. తన గాయంపై…
Sunil Gavaskar on Rishabh Pant: ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల తేడాతో ఓడింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో.. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో పంత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా…
Rishabh Pant About DC vs SRH Match: టాస్ విషయంలో తాను పొరపాటు చేశానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడమే తమ కొంపముంచిందన్నాడు. పవర్ ప్లేనే మా ఓటమిని శాసించిందని చెప్పాడు. వచ్చే మ్యాచ్‌లలో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం అని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 67 పరుగుల…