ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 57 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
Read Also: Mumbai hoarding: వెలుగులోకి వచ్చిన దారుణమైన విషయాలు.. నిందితుడి హిస్టరీ ఇదే!
ఢిల్లీ బ్యాటర్లలో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ డకౌట్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత.. క్రీజులోకి వచ్చిన షాయ్ హోప్ (38) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (33) పరుగులతో రాణించాడు. చివర్లో స్టబ్స్, అక్షర్ పటేల్ (14) పరుగులు చేయడంతో.. లక్నో జట్టుకు భారీ స్కోరును నిర్దేశించారు. లక్నో బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తల ఓ వికెట్ సంపాదించారు.
Read Also: Yellow Urine Reasons: ఈ కారణాల వల్ల మూత్రం పసుపు రంగులోకి మారవచ్చు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి!