Rohith Sharma In IPL: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ఢిల్లీ, లక్నో ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఒకవేళ రోహిత్ ముంబైని వదిలేసి వేలంలోకి వస్తే.. రూ.50 కోట్లైన సరే దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ రెండు ఫ్రాంచైజీలు రూ. 50 కోట్ల మనీ పర్స్ ని సేవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫ్రాంఛైజీలకు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ మ్యాన్ ను తీసుకోవాలని అనుకున్నట్లు టాక్.
ఇకపోతే భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ అద్భుత ప్రదర్శన వల్ల.. ఆయన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసి 5 టైటిల్స్ ను కైవసం చేసుకుంది. ఇదిలావుండగా, గత సీజన్‌లో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒకవేళ ముంబై ఇప్పుడు రోహిత్ ను విడుదల చేస్తే.. మెగా వేలంలో కోట్లకు అమ్ముడుపోవచ్చు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో మళ్లింపు..!
రోహిత్‌కి ముంబై టీంతో చాలా పాత అనుబంధం ఉంది. డెక్కన్ ఛార్జెస్ తరఫున ఆడుతూ.. ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. కానీ, అతను మొదటి మూడు సీజన్ల తర్వాత ముంబై ఇండియన్స్ లో చేరాడు. అతి తక్కువ సమయంలో అతను జట్టుకు కెప్టెన్ అయ్యాడు. 2014లో రోహిత్ రెమ్యూనరేషన్ రూ.12.50 కోట్లు. అది 2018లో రూ.15 కోట్లకు పెరిగింది. దీని తరువాత, రోహిత్ 2022 నుండి 16 కోట్ల రూపాయలు పొందడం ప్రారంభించాడు. రోహిత్ ఇప్పుడు వేలానికి వస్తే మరింత సంపాదించవచ్చు.