ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరోసారి పోస్టర్ వార్ మొదలైంది. ఈ రాజకీయ పోరులో ఇరు రాజకీయ పార్టీల నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ తన పోస్టర్లలో ‘ఆప్’ కుంభకోణాలను బయటపెట్టడంలో బిజీగా ఉంది. అదే సమయంలో ఆప్ కూడా ‘పుష్ప’ తరహాలో బీజేపీపై విరుచుకుపడింది.
READ MORE: Hyderabad Air Show: నేడు ట్యాంక్‌బండ్‌పై ఎయిర్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు..
ఆప్ ప్రభుత్వ మోసాలను ప్రస్తావిస్తూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. మద్యం, మొహల్లా క్లినిక్, హవాలా, సెక్యూరిటీ, రేషన్, పానిక్ బటన్, షీష్‌మహల్, మెడిసిన్, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్‌రూమ్, సీసీటీవీ స్కామ్‌లతో పాటు ‘కేజ్రీవాల్ స్కామ్‌ల వెబ్’ అని క్యాప్షన్ పెట్టింది.
READ MORE:Pushpa 2 : పుష్ప-2 టికెట్ రేట్ అందరికి అందుబాటులో ఉంటుంది : మైత్రీ నిర్మాతలు
దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన పోస్టర్లలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రంలోని అధికార బీజేపీని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. ఆప్ విడుదల చేసిన పోస్టర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు చీపురు చూపించి ‘ఫిర్ ఆ రహా హై కేజ్రీవాల్’ అని ‘పుష్ప’ స్టైల్‌లో ఫోజ్ ఇస్తూ కనిపించాడు. అంటే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి రానున్నారనే అర్థం వచ్చేలా పేర్కొన్నారు. ఈ ఫోటోపై ‘కేజ్రీవాల్ తలవంచడు'(తగ్గేదేలే) అని ఉంది. కేజ్రీవాల్ 4 వ సారి అధికారంలోకి వస్తారని పేర్కొన్నారు.
READ MORE:Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్
ఇదిలా ఉంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే బీజేపీ కూడా నియోజకవర్గ కమిటీలను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆప్‌తో పొత్తు ఉండబోదని తెలిపింది. మొత్తానికి ఢిల్లీలో త్రిముఖ పోరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.