Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ భావిస్తుంటే, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఇక కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక హామీలను సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నిన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా ఉంది. ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్‌గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.