Atishi: సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి
- సీఎం బంగ్లా మరోసారి రద్దు
- సోమవారం నోటీసు వచ్చిందన్న అతిషి
- ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న సీఎం అతిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. అయితే ఢిల్లీలో షెడ్యూల్‌కు ముందు నుంచే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన బంగ్లాను మరోసారి కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. మూడు నెలల కాలంలో ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లా ఖాళీ చేయాలంటూ సోమవారం నోటీసులు వచ్చాయని తెలిపారు. బంగ్లా ఖాళీ చేయాలంటూ నోటీసులు పేర్కొన్నారని చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యుల్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని.. తాను సీఎంగా ఎన్నికైన తర్వాత.. తన వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు బయటకు విసిరేశారని తెలిపారు. ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా.. మా ఇండ్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లల్లో ఉండి వాళ్ల కోసం పని చేస్తానని అతిషి చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..
మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ తొలి విడతగా 29 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
#WATCH | Delhi CM Atishi says, "Today the dates for the upcoming assembly elections have been announced…The BJP-led central government has thrown me out of the Chief Minister's residence for the second time in three months…The BJP thinks that they will stop us from working by… pic.twitter.com/nmLrJrZI2h
— ANI (@ANI) January 7, 2025
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!