Arvind Kejriwal: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు బీజేపీ సీనియర్ నేత, అమిత్ మాలవీయ దేశం గురించి తర్వాత ఆలోచించండి.. ముందు మీ సీటును కాపాడుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఈ రెండు పార్టీల మధ్య అనుబంధాన్ని ఢిల్లీ ఎన్నికలు బహిర్గతం చేస్తాయన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి రాహుల్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తాను దేశ రక్షణ కోసం కృషి చేస్తున్నా.. తనపై అతడు చేసిన విమర్శలను పట్టించుకోనని కేజ్రీవాల్ వెల్లడించారు.
Read Also: Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..
ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీలంపుర్‌లో సోమవారం నాడు జరిగిన జై బాపు, జై భీం, జై సంవిధాన్’ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ సర్కార్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. మోడీ అనుసరించే ప్రచార కండూతి వ్యూహం, అబద్ధపు హామీల బాటలో కేజ్రీవాల్ సైతం నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలను వారిద్దరూ పట్టించుకోవడం లేదన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు రిజర్వేషన్లలో తమ వాటాలను సాధించుకునేందుకు చేపట్టాల్సిన కులగణనపై మోడీ, కేజ్రీవాల్ మౌనం వహిస్తున్నారని విమర్శలు చేశారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
Read Also: Laurene Powell: మహా కుంభమేళాలో అస్వస్థతకు గురైన స్టీవ్ జాబ్స్ భార్య..
అయితే, 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను రిలీజ్ చేస్తామని ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ చెప్పారు. 2015 నుంచి రెండుసార్లు గెలిచిన ఆప్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈసారి ఢిల్లీలో పాగా వేయాలని ట్రై చేస్తుంది. మరోసారి ఢిల్లీలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.