AAP MLA Dinesh Mohaniya: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీస్ కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. సదరు మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిపోయింది.
Delhi Assembly Election 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025కి రంగం సిద్ధమైంది. దేశ రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాలలో ఈరోజు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 1.55 కోట్లకు పైగా నమోదిత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నేడు ఎన్నికలు జరగనుండగా ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించబడతాయి. ఈ ఎన్నికలలో…
Delhi Assembly Election 2025 Live UPDATES: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. యమునా జలాలను హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కేజ్రీవాల్ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.