ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 38 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్ల వల్ల ప్రభావితమైన, ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అసెంబ్లీ స్థానాల ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా.. గత రెండు ఎన్నికల్లో…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP) ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత వికసిస్తోందా? అనేది తేలనుంది. అదే…
రోహిణి అసెంబ్లీ స్థానానికి తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ కు 3235 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా కు 3187 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ కు 177 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది.. మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది..…
Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ!
Delhi Exit Polls : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం EVMలో నిక్షిప్తం అయింది.
Exit Polls Time : ఢిల్లీని ఎవరు పాలిస్తారు.. ఎవరిని ఎవరు ఓడిస్తారు.. ఢిల్లీ గద్దెపై ఎవరు పట్టాభిషిక్తులు అవుతారు అనే అస్పష్టమైన చిత్రాన్ని ఈ రోజు కాసేపట్లో చూడబోతున్నాం.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ నేతలు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఢిల్లీ సీఎం ఆతిశీ, ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జై శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటికి.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా.. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.