Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్‌కి సూత్రధారి’’.. కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
- కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు..
- లిక్కర్ స్కామ్ సూత్రధారి అంటూ ఆరోపణలు..
- ఆప్‌పై విరుచుకుపడిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్‌ని చంపాలని ప్రయత్నించారు..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
పట్పర్ గంజ్ నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ వచ్చినప్పుడు చిన్న కార్ ఉండేది, కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. ఢిల్లీని మారుస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఢిల్లీలో 2020 అల్లర్లు జరిగినప్పుడు కనిపించలేదు. ఆయన క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, కానీ అతిపెద్ద మద్యం కుంభకోణం ఢిల్లీలోనే జరిగింది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ‘‘శీష్ మహల్’’ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిందనే బీజేపీ ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ తనను తన ఇంటి నుంచి బయటకు నెట్టారు. ఆ సమయంలో ఇంటి కీని వారికి ఇచ్చి ఉంచుకోవచ్చని చెప్పాను. కానీ కేజ్రీవాల్ శీష్ మహల్‌లోనే ఉంటున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. కలిసి పోటీ చేద్దామనే నిర్ణయాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్, ఆప్ లక్ష్యంగా కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!