Delhi Assembly Election 2025 Live UPDATES: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చడానికి మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోని 13, 766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కించి, ఫలితాలు విడుదల చేయనున్నారు. మరిన్నీ వివరాల కోసం ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్ మీ కోసం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచి ఉత్సాహంగా వచ్చారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏఐఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తఫాబాద్ స్థానంలో 12.43 శాతం పోలింగ్ నమోదైంది అని ఈసీ ప్రకటించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యానికి- అసత్యానికి మధ్య యుద్ధం కొనసాగుతుంది.. ఈ యుద్ధంలో ఢిల్లీ ప్రజలు సత్యానికి అండగా నిలుస్తారని అనుకుంటున్నా.. గూండాయిజాన్ని ఓడిస్తారని నేను ఆశిస్తున్నా..
ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్.. సమాధ్యలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Delhi: Earlier visual of President Droupadi Murmu arriving at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate to cast her vote for #DelhiElection2025. pic.twitter.com/FP2Rm6PXrG
— ANI (@ANI) February 5, 2025
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆప్ నాయకుడు, జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటు వేశారు. ఆయన భార్య సీమా సిసోడియా కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia casts his vote at a polling booth at Lady Irwin Senior Secondary School in New Delhi Assembly constituency. His wife Seema Sisodia is also voting here. pic.twitter.com/5OsPMZJb8c
— ANI (@ANI) February 5, 2025
ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ గొప్ప పండుగలో ఉత్సాహంగా పాల్గొని ఓటు వేయాలని ఢిల్లీ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా కోరారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత.. మీరు వేసే ప్రతి ఓటు మన పిల్లల మెరుగైన రేపటి కోసం ఉపయోగపడుతుంది.. ఢిల్లీ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి: సిసోడియా
2025 ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ..
#WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Nirman Bhawan after casting his vote for #DelhiElections2025 https://t.co/NySApvSKSf pic.twitter.com/F6xRDJiPRF
— ANI (@ANI) February 5, 2025
తుగ్లక్ క్రెసెంట్‌లోని NDMC స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. నేను తొలి ఓటర్లలో ఒకడిని.. ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను..
#WATCH | #DelhiElections2025 | EAM Dr S Jaishankar and his wife Kyoko Jaishankar cast their vote at a polling booth set up at NDMC School of Science and Humanities, Tughlaq Crescent. pic.twitter.com/Vv67tjSv4m
— ANI (@ANI) February 5, 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు..
ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు ఢిల్లీలోని సంగం విహార్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు 323/341/509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఆప్ తరపున కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిషి పోటీ చేస్తుండగా, బీజేపీ తన మాజీ ఎంపీ రమేష్ బిధురి బరిలో ఉన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న నా సోదరీమణులు, సోదరులు అందరు తప్పుడు వాగ్దానాలు, కలుషితమైన యమునా నది, మద్యం దుకాణాలు, పడైపోయిన రోడ్లు, మురికి నీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్.. ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించకోండి.. మీ ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదు: అమిత్ షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు అన్ని స్థానాలకు పోలిగ్ జరుగుతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని కోరుతున్నాను.. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరు గుర్తుంచుకోవాలి - మొదట ఓటు, తరువాత రిఫ్రెష్మెంట్: నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని శుభ్రం చేస్తానని చెప్పాడు కానీ ఏమీ చేయలేదు.. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. హర్యానా ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపిందని కేజ్రీవాల్ అన్నారు.. అతనికి మూడుసార్లు అవకాశం వచ్చింది.. కానీ అతను ఏమీ చేయలేదు.. ఈసారి ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.. న్యూఢిల్లీ సీటులో కూడా కమలం వికసిస్తుంది: పర్వేష్ వర్మ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయన భార్య లక్ష్మీ పూరి శాంతి నికేతన్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో ఓటు వేశారు.
ఢిల్లీలో నేటి ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు, ఇది మతపరమైన యుద్ధం' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు. ఇది మంచికి, చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం.. ఢిల్లీ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. పని చేసేవారికి, మీకు మంచి చేసిన వారికే ఓటు వేయండి.. సత్యమే గెలుస్తుంది: సీఎం అతిషీ
ఎన్నికలు సజావుగా ఓటింగ్ జరిగేలా ఢిల్లీ అంతటా బహుళ అంచెల భద్రతను మోహరించారు.. 220 కంపెనీల పారామిలిటరీ దళాలు.. 35,626 ఢిల్లీ పోలీసులతో పాటు 19,000 మంది హోమ్ గార్డులను నియమించిన ఈసీ. దాదాపు 3,000 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.. పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్
హ్యాట్రిక్ విక్టరీ కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలోని ఆప్- కాంగ్రెస్ మధ్య కూస్తీ.. బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం..
ఢిల్లీతో పాటు యూపీ, తమిళనాడులో 2 స్థానాలకు ఉప ఎన్నికలు..
న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ.. బరిలో బీజేపీ నుంచి పర్వేజ్ శర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్.. కల్కాజీ నుంచి సీఎం అతిశీ పోటీ..
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ.. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు.. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు.. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు.