తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాల్లో పాల్గొన్నారు… దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులతో కలసి సందడి చేశారు.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు బాలకృష్ణ దంపతులు.. ఇక, లోకేశ్వరి, ఉమామహేశ్వరి.. ఇలా నందమూరి కుటుంబ సభ్యులంతా ఓ చోట చేరడంతో అసలైన పండుగ వాతావరణం కనిపించింది.
Read Also: అరుదైన ఘనత.. ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా కొవాగ్జిన్
భోగీ వేడుకల్లో పాల్గొనేందుకు లెజండ్ బాలకృష్ణ గురువారం రోజే కారంచేడు చేరుకున్నారు.. బాలయ్య తన చిన్నతనంలో ఎక్కువ భాగం కారంచేడులోనే గడిపారని.. సెలవుల్లో ఎక్కువగా ఇక్కడే ఉండేవారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఓ సందర్భంలో తెలిపిన విషయం తెలిసిందే.. బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారమే కారంచేడుకు చేరుకున్నారు. గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకోవడంతో సందడి నెలకొంది.