ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుంది: పురందేశ్వరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని పురందేశ్వరి అన్నారు. అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించినట్టు పురందేశ్వరి తెలిపారు.ఏపీ విభజన బిల్లు అంశాలపై అమిత్ షాతో చర్చించామని తెలిపింది. విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలు ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందని మిగిలిన అంశాలపై కూడా చర్చించామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని దీనిపై కూడా పోరాటం చేస్తామని ఆమె అన్నారు.అమిత్‌షా పురందేశ్వరి భేటీ అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కూడా చర్చలు జరిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుంది: సోము వీర్రాజు
అమిత్ షాతో భేటీ అనంతరం మీడియాతో సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం ఉండటంతో 2024లో అధికారం దిశగా అడుగులేయాలని, అమిత్ షా దిశా నిర్దేశం చేసినట్టు వివరించారు. ఏపీలో ముఖ్యమైన నేతలను బీజేపీలో చేర్చు కుని 2024 లో ఏపీలో అధికారం దిశగా కార్యచరణ రూపొందించు కునేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన అన్నారు.ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పారు. అనం తరం తిరుపతి పర్యటన ముగించుకున్న అమిత్ షా రేణిగుంట విమా నాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఢీల్లీ బయలుదేరి వెళ్లారు.
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!