తిరుపతి లో యన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు పలువురు పాల్గొంటున్నారు. ఇక ఈ ప్రోగ్రామ్ లో భాగంగా చీఫ్ జస్టిస్ రమణతో పాటు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొని ఎన్టీఆర్ వీరాభిమాని టిటిడి ఎక్స్ బోర్డ్ మెంబెర్ ఎన్టీఆర్ రాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ‘తిరుపతి అంటే ఎన్టీఆర్ గారికి ఎంత ఇష్టమో అలాగే యన్టీఆర్ రాజు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే ఈ రోజు ఇక్కడ నాన్నగారి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం.
సినీ రాజకీయాలలో ఎదురులేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్న తెలుగు ప్రజల ఆరాధ్య దైవం మా నాన్న గారిని గౌరవిస్తూ రూ.100 నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు ఆర్‌బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము’ అని అన్నారు. ఈశతజయంతి ఉత్సవాలలో యన్టీఆర్ అభిమానులను దగ్గుబాటి పురంధేశ్వరి సన్మానిస్తూ తిరుపతి లోని ఎన్టీఆర్ రాజు మా కుటుంబానికి చాలా ఆప్తుడు. తనను మా కుటుంబంలోని వ్యక్తిగా భావించే ఈ సన్మానం చేస్తున్నాం అని తెలిపారు.