Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం…
Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్‌తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్‌లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది.…
MLA Wife Digital Arrest Scam: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైన సంఘటన కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు తమను సీబీఐ, బ్యాంక్ అధికారులు, పోలీసులుగా పరిచయం చేసుకుంటూ భారీ మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఎమ్మెల్యే భార్య ఫోన్‌కు కాల్ చేసిన మోసగాళ్లు, ఆమె పేరు మనీ లాండరింగ్ కేసులో ఉందని, విచారణ పూర్తయ్యే వరకు ఫోన్‌ను ఆఫ్ చేయకుండా వీడియో కాల్‌లో ఉండాలని ఆదేశించారు. తమ…
CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు..…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.…
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస దాడుల్లో పలు ఆన్లైన్ మోసగాళ్లను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
సాండల్‌వుడ్ నటుడు ఉపేంద్ర మరియు నటి ప్రియాంక ఉపేంద్రల మొబైల్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటన గురించి సమాచారాన్ని పంచుకుంటూ, నటుడు ఉపేంద్ర సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి, ఒక వార్నింగ్ మెసేజ్ జారీ చేశారు. ఈ వీడియోలో, తమ ఫోన్లు హ్యాక్ అయిన విషయాన్ని వెల్లడిస్తూ, తమ పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని కోరారు. ఉపేంద్ర తన వీడియో సందేశంలో “అందరికీ నమస్కారం. మేము…
చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న…