CP Sajjanar: సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంచి సమాజ నిర్మాణం కోసం యువత పాటు పడాలన్నారు. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ ఐక్యత దినోత్సవం) జాతీయ ఐక్యత కోసం 5K RUN కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని స్పష్టం చేశారు. డీప్ ఫెక్ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్ పెట్టామన్నారు.. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని తెలిపారు.. ప్రజల్లో ఎంత అవగాహనా తీసుకువస్తున్నా.. డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారన్నారు.
READ MORE: Baahubali The Epic : రీ రిలీజ్ కూడా బాహుబలి రికార్డు – ప్రీ బుకింగ్స్‌లో సునామీ !
పిల్లలు రూ. 5 వేలు, రూ.10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారు. దీని వల్ల మీరు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ SI సస్పెండ్ పై సీపీ స్పందించారు. “విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్ సస్పెండ్ చేశాం. నిందితులు పరారీలో ఉన్నారు. ఉప్పలపాటి సతీష్ పై CID, GST కేసులు ఉన్నాయి. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం..” అని సీపీ పేర్కొన్నారు.
READ MORE: Vizianagaram: డ్రోన్ కెమెరాలో బందీగా తాటిపూడి రిజర్వాయర్ అందాలు.. పచ్చని కొండల మధ్య అద్భుత దృశ్యం