IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్‌లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది.
అడిషనల్ సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. రవిని పట్టుకునేందుకు అతని స్నేహితుడు నిఖిల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఐబొమ్మ, బప్పమ్ మూవీ పోస్టర్లను నిఖిల్ తయారు చేస్తుండడంతో, అతని ద్వారా రవికి దగ్గరగా చేరిన పోలీసులు అతడిని జాగ్రత్తగా ట్రాప్ చేశారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనల ద్వారా రవికి భారీ స్థాయిలో డబ్బులు వచ్చేవి. ఈ డబ్బును రవి తన పేరుతో నడుపుతున్న యాడ్ బుల్ అనే కంపెనీకి మళ్లించాడు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో విదేశీ ట్రాన్సాక్షన్లు జరిగేవని సీపీ తెలిపారు.
Jagga Reddy : నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను
దర్యాప్తు ప్రకారం.. మొత్తం వ్యవహారాన్ని రవి ఒక్కడే నిర్వహించినట్టు బయటపడింది. అతనికి ఉన్న టెక్నికల్ పరిజ్ఞానంతోనే ఐబొమ్మను క్రియేట్ చేశాడని స్పష్టం చేశారు. I Bomma, Bappam డొమైన్ లను ఎన్జీవోలుగా రిజిస్టర్ చేసుకున్నాడు.. దీనికోసం తన క్రెడిట్ కార్డ్ వాడాడు రవి.. కేసు విచారణలో పోలీసులు రవికి హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలలో ఆస్తులు ఉన్నాయని గుర్తించారు.
దర్యాప్తు జరుగుతున్న సమయంలో పోలీసులకు ఒక గుర్తు తెలియని ఐడి నుంచి మెయిల్ వచ్చింది. “మీరు ఏ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు?” అని ప్రశ్నించిన ఆ మెయిల్‌పై పోలీసులు రివర్స్ ఇంజినీరింగ్ చేశారు. దర్యాప్తులో ఆ మెయిల్‌ను పంపింది రవినేనని తేల్చారు. దీంతో రవి తనపైన జరుగుతున్న విచారణను గమనిస్తూ, పోలీసులు ఏ సమాచారాన్ని కలిగి ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు స్పష్టమైంది. ఐబొమ్మ రవి ఆర్థిక లావాదేవీలు, యాడ్ నెట్‌వర్క్, డిజిటల్ కార్యకలాపాలపై పోలీసులు ఇంకా లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.
AP New Districts: జిల్లాల పునర్విభజనపై సీఎం కీలక సమీక్ష.. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు