డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.. అయితే, ఈజీగా డబ్బులు సంపాదించడం.. జల్సాలు చేయడానికి అలవాటు పడి.. కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు.. అందులో భాగంగా మాయమాటలు చెప్పేవాళ్లు... అమ్మాయిలను ట్రాప్ చేసి ముగ్గులోకి దింపేవారు... అమ్మాయిల న్యూడ్ వీడియోలను బ్యాన్ చేసిన పోర్న్ వెబ్ సైట్లకు అమ్ముకుంటూ లక్షలకు లక్షలు సంపాదించేవారు... ఇలాంటి ఓ దుర్మార్గపు గ్యాంగ్ ఆట కట్టించారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు.
Indians Trapped: పొట్ట కోటి కోసం దేశం కానీ దేశం వెళ్తే అక్కడ సైబర్ నెరగాళ్లు బంధించి బలవంతంగా పని చేయించారు.. కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏర్పాటు కూడా చేయలేదు.
ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు.
ఇటీవల కాలంలో లోన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.
Old Phones: కొత్త ఫోన్‌పై మోజుతో పాత సెల్‌ఫోన్లను అపరిచిత వ్యక్తులకు విక్రయిస్తున్న వారికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాత ఫోన్ అమ్మి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
Crazy Offer : మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు... ఆన్‌లైన్ మోసం రోజు రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. దుండగులు సాధ్యమైనన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేస్తే రూ.10వేలు ఇస్తామంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేరువేరు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళని బురిడీ కొట్టించారు, స్టాక్ మార్కెట్ లో పెటుబడి పేరుతో ఫోన్‌లో వచ్చిన మెసేజ్ మరియు లింక్‌లపై స్పందించిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గరనుంచి రూ. 18 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..