Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్‌ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్‌ల రూపంలో లింక్స్‌ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక…
సోషల్ మీడియాలో రోజు రోజుకి ఆకతాయిల వేధింపులు ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటువంటి వేధింపులు ఎదురయ్యాయి. దాంతో సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొంది నిధి అగర్వాల్. ఆ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు…
Digital Arrest Call: ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ తరహా కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఒక ఇలాంటి విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో, యువకుడి చాకచక్యంతో మోసగాడు స్వయంగా ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయవలసి వచ్చింది. అసలు సంగతి ఏంటన్న విషయానికి వస్తే.. ముంబైలోని అంధేరీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మోసగాడు బాధితుడిని భయపెడతాడు. ఈ వీడియో ప్రారంభంలో,…
AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇ
CP Avinash Mohanty : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్…
DCP Narasimha : సైబరాబాద్ పరిధిలో 3 కోట్ల 30 లక్షల విలువ చేసే 1100మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్స్ క్రైమ్స్ డీసీపీ నర్సింహా మాట్లాడుతూ.. 2023 ఏప్రిల్ 20నుండి కేంద్ర ప్రభుత్వం సీఈఐఆర్ ప్రవేశపెట్టారని, ఎక్కువ ఫిర్యాదులు మొబైల్స్ చోరీ, పోగొట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. వాళ్లంతట వల్లే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని,…
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట.. ఓ కేసులో నిర్దోషిగా ప్రకటన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇమ్నాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ ఖైజర్, సైఫుల్లా నియాజీ, సదాకత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మీరు…
పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు.
పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.