బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
READ MORE: MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఔరంగజేబ్ సమాధిని కూల్చి…
ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
READ MORE: Nagarkurnool: దారుణం.. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు.