యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు అయింది. హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ‘బెట్టింగ్ యాప్‌లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది. వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తోంది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్లు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా..? సమాజహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా..! ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను ఆన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
Read Also: Bhuma Vikhyat Reddy: భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు!
కాగా.. యూట్యూబర్ హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. యువత బెట్టింగ్‌ల బారిన పడకుండా ఉండాలని పలు సూచనలు కూడా ఇస్తున్నారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతున్నారని.. వీటిని నమ్మి మోసపోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.
Read Also: AR Rahman: అపోలో ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లు అమాయక యువకులను టార్గెట్ గా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లిస్తున్నారు. అలాంటి వారికి సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బుద్ధి చెబుతున్నారు. ఇటీవల కాలంలో సజ్జనార్ తనదైన శైలిలో సైబర్ నేరాలపై పరిష్కారం చూపుతున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్ ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట జిల్లాకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై సీరియస్‌గా వ్యవహరిస్తుండడంతో రాష్ట్రంలోని ఇన్ఫ్లయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాలలోని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీడియోలను తొలగిస్తున్నారు.