సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్న సిమ్ కార్డుల రద్దు దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలు అమల్లోకి వస్తే దాదాపు 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు అయ్యో అవకాశం ఉంది. అలాగే, 2.26 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతుంది.
ప్రముఖులను కూడా కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్‌ను కేటుగాళ్లు మోసం చేశారు. వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్‌ను రూ. 7 కోట్ల మేర మోసగించిన అంతర్-రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను పంజాబ్ పోలీసులు ఆదివారం ఛేదించారు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏ పేరుతో ఫోన్ చేసి.. ఎలా ట్రాప్ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు ఏ కంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు పేరు మీద.. అతడికి తెలియకుండానే పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు కేటుగాళ్లు.. తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూప్ కుమార్‌కు తెలియకుండా.. అతడి పేరు మీద ఏకుండా రూ.13.8 లక్షలు లోన్ కాజేశారు సైబర్ నేరగాళ్లు..
Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్లైన్లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు.…
DY Chandrachud: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ను కూడా స్కామర్లు వదల లేదు. ఆయన ఫొటో, ఆయన పేరుతో నకిలీ ఐడీ క్రియేట్ చేసి పలువురికి మెసెజ్ లు పెట్టిన డబ్బులు అడుగుతున్నారు. కాగా, ఇటీవల ఎక్స్ యూజర్ కైలాష్ మేఘ్వాల్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది.
Gaddam Prasad Kumar: తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాను కొందరు హాకింగ్ గురి చేశారు. ఈ హ్యాకింగ్ జరిగిన సమయంలో హ్యాకింగ్ చేసినవారు కొన్ని వీడియోలను, పోస్టులను పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ టెక్నికల్ టీం వెంటనే అందుకు సంబంధించిన తగిన చర్యలను తీసుకోంది. దాంతో పరిస్థితిని టెక్నికల్ టీం అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…
హైదరాబాద్‌లో పాత బస్తీ ప్రాంతంలోని ఓ బ్యాంక్‌లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్లు భారీ సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో రిక్షా డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో-రిక్షా డ్రైవర్లు జాతీయ బ్యాంకులో ఆరు ఖాతాలను తెరిచారు, సైబర్ నేరగాళ్ల ద్వారా నిధుల బదిలీని సులభతరం చేశారు. ఈ నిధులను హైదరాబాద్ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు తరలించారు. సైబర్ నేరగాళ్లు నిధులను బదిలీ చేయడానికి క్రిప్టోకరెన్సీని కూడా ఉపయోగించారు.…
రిలయన్స్ జియో హెచ్చరికలు జారీ చేసింది. జియో తన పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చింది. జియో పేరుతో ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీ జియో మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.
Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్‌లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే టోకరా వేశారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. సైబర్…
సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు.