సందు దొరికితే చాలు.. సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపై అవగాహన లేని కొందరు ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్లను సర్చ్ చేస్తూ.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వెంకట లక్ష్మీ అనే మహిళకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఎస్బీఐ యోనో యాప్‌ను వినియోగిస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె ఫోన్లో ఎస్బీఐ యోనో యాప్ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌ను సంప్రదించింది.…
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…
సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీసీఎస్ సైబర్ క్రైం టీమ్ లు రెండు ముఠాల గుట్టు రట్టు చేశాయి..ఉద్యోగాల పేరుతో, బహుమతుల పేరుతో మోసాలు చేస్తున్న రెండు సైబర్ గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. ఢిల్లీ లోని ఓ కాల్ సెంటర్ పై రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నైజీరియన్లను…
రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో పడి దాదాపుగా రూ.లక్ష నగదును పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… జీడిమెట్లకు చెందిన చంద్రమోహనేశ్వర్రెడ్డి కుమార్తె అమెరికాలో ఉన్నత చదువులను అభ్యసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కొన్ని పేపర్లను ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపించింది. అయితే తన కుమార్తె పేపర్లు పంపి చాలా రోజులు గడుస్తున్నా… ఇంకా పేపర్లు తనకు చేరకపోవడంతో గూగుల్‌లో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్…
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్మీట్లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్…
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్లైన్లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో…
సైబర్ చీటర్ నైజీరియన్ ను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పేర్లతో పరిచయం, ఆపై ప్రేమ , పెళ్లి అని ఓ యువతిని నమ్మించిన నైజీరియన్… తను యూకే లో డాక్టర్ అని చెప్పాడు. యూకే నుండి 40 వేల ఫౌండ్ల నగదు పార్సిల్ పంపిస్తున్నానని చెప్పిన చీటర్… ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేసాడు. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్సల్, ఐటి, మనీలాండరింగ్…
నేటి సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీని మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోజు పదుల సంఖ్యలో వివిధ సంస్థలకు సంస్థలకు సంబంధించిన వైబ్‌సైట్ లింకులు మన ఫోన్లకు వస్తుంటాయి. అయితే వాటిలో ఏది కంపెనీతో ఏదీ సైబర్ నేరగాళ్ల తెలియక ఎంతో మంది మోసపోతున్నారు. ఇదిలా ఉంటే.. చిన్నవయసు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో సహజీవనం చేస్తున్నారు చిన్నారులు. ఉదయ నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు చాలా సమయం ఫోన్లో గేమ్‌లు ఆడటానికి, వీడియోలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు.…
దేశంలో సైబర్ నేరగాళ్ల వలలో పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి… వినోద్ కాంబ్లీకి…
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్లో సేవలందించారు. విజయవంతంగా సేవలు…