జనాల్లో ఎలక్ట్రిక్ బైకుల మోజు విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకేముందు.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి డీలర్షిప్ కోసం కొందరు ముందుకొస్తున్నారు. మోసగాళ్లు కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇందుకు తాజా ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యం! డీలర్షిప్ పేరుతో ఓ నెరగాడు ఒక వ్యక్తిని రూ. 12.50 లక్షల మేర మోసం చేశాడు.…
A 22 years old software engineer killed herself after learning that she fell victim to online fraud. Going into details, the deceased is identified as Jasti Swetha Chowdary who hails from Nuvuluru of Mangalagiri mandal, Guntur district.
సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు జనాల్ని బుట్టలో పడేద్దామా? టోకరా వేద్దామా? అంటూ నిత్యం కాచుకొని ఉంటారు. ఇందుకోసం వాళ్లు చేయని ప్రయత్నాలు, రచించని వ్యూహాలంటూ ఉండవు. లక్షల్లో, కోట్లలో ప్రైజ్‌మనీ గెలుచుకున్నారంటూ.. తమ ట్రాప్‌లో పడేసేందుకు ట్రై చేస్తారు. ఇలా ఎంతోమంది టెంప్ట్ అయ్యి, లక్షలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారి కూడా అలాగే మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, లక్షల రూపాయల్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్లకు…
కరెంట్ బిల్లు పేరుతో లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన హైదరాద్‌లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకి చెందిన వ్యక్తి ఫోన్ కి కరెంట్ బిల్లు కట్టాలని, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. అయితే దీంతో ఖంగుతిన్న అతను అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుకి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్ కి ఫోన్ చేశాడు. దీంతో కేటుగాళ్లు…
వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ. భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్…
రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ లైన్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ చుసిన ఆన్ లైన్ నేరగాళ్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ను అదునుగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఎక్కువగా యువతను టార్గెట్ గా చేసుకొని , అందినంత లాగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీస్కుంటున్నప్పటికీ , నగరంలో సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ అవడం వల్ల సైబర్ నేరాలను అదుపు చేయడం పెద్ద ఛాలెంజ్ లాగా మారింది. చిన్న వయస్సు…
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ…
దేశంలోనే మొట్ట మొదటిసారిగా కరుడుగట్టిన సైబర్ నేరగాడి ఆగడాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కళ్లెం వేశారు. ఇంజనీరింగ్ కూడా పూర్తి చేయలేని ఓ యువకుడు ఎవరికీ దొరకకుండా తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పేమెంట్ గేట్ వేల నుంచి మాయం చేస్తున్నాడు. ఎథికల్ హ్యాకర్లకు కూడా అంతుచిక్కని స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాడు. అతడు ఉపయోగించే సిమ్ కార్డు నుండి బ్యాంకు ఖాతాల వరకు అన్నీ నకిలీ పత్రాల ద్వారా తెరిచినవే. అసలు ఇంజనీరింగ్ డ్రాప్…
సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ నేరగాడు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఎంపీ సంజీవ్ కుమార్ కు ఫోన్ వచ్చింది.…