రాష్ట్రంలో జరుగుతున్న ఆన్ లైన్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎక్కడ చుసిన ఆన్ లైన్ నేరగాళ్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ను అదునుగా చేసుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఎక్కువగా యువతను టార్గెట్ గా చేసుకొని , అందినంత లాగుతున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీస్కుంటున్నప్పటికీ , నగరంలో సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ అవడం వల్ల సైబర్ నేరాలను అదుపు చేయడం పెద్ద ఛాలెంజ్ లాగా మారింది. చిన్న వయస్సు నుండి పెద్ద వయస్సు కల్గిన వారు కూడా సైబర్ నేరగాళ్ల భారిన పడుతున్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణ సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ (T4C) ఆధ్వర్యంలో..గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లో..సైబర్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యురిటీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక్క రోజు పాటు జరుగనున్న ఈ సదస్సు ను తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (T4C) ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ (I4C) సహకారంతో ఏర్పాటు చేశారు..
సైబర్ నేరగాళ్ల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు ఎలా చేపట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, సైబర్ నేరాలను ఎలా గుర్తించాలి. ఎలా అప్రమత్తం అవ్వాలి అనే విషయాల మీద ఈ సదస్సులో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ సదస్సును ప్రారంభించారు…అనంతరం రాష్ట్ర DG మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు.