కరెంట్ బిల్లు పేరుతో లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన హైదరాద్‌లో చోటు చేసుకుంది. మెహిదీపట్నంకి చెందిన వ్యక్తి ఫోన్ కి కరెంట్ బిల్లు కట్టాలని, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపించారు. అయితే దీంతో ఖంగుతిన్న అతను అమెరికా నుంచి వచ్చిన తన కొడుకుకి ఆ మెసేజ్ చూపగా, అది నిజమేనేమో అనుకున్న అతని కొడుకు మెసేజ్ వచ్చిన ఫోన్ కి ఫోన్ చేశాడు. దీంతో కేటుగాళ్లు అతనికి ఒక లింక్ మరియు ఓటిపి పంపించారు.
అతనికి ఓటిపి అందగానే అతని బ్యాంక్ అకౌంట్ లో నుండి 8 లక్షల 50 వేల రూపాయలు ఖాళీ అయిపోయాయి. బ్యాంకు నుండి డబ్బులు ఖాళీ అయ్యాయని గ్రహించిన సదరు వ్యక్తి.. మోసపోయానని తెలుసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.