Coaching Staff: భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు.. ఆ ఇద్దరికి బీసీసీఐ స్వస్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టి20, వన్డే సిరీస్‌లలో ఎదురైన ఓటముల అనంతరం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోస్చేట్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్టులను పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటన ముగిసే వరకు వీరిని కొనసాగించినప్పటికీ, ఒప్పందం ముగియడంతో ఇకపై ఎలాంటి పొడిగింపు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. టెన్ డోస్చేట్ రెండేళ్ల కాంట్రాక్ట్ జూన్ 10తో, టి. దిలీప్ కాంట్రాక్ట్ జూన్ 8తో పూర్తయ్యాయి.
పదవీకాలాన్ని పొడిగించకపోవడానికి కారణాలు..
రయాన్ టెన్ డోస్చేట్: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచన మేరకు జట్టులోకి వచ్చిన డోస్చేట్కు మొదట ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు ఇస్తామని చెప్పారు. కానీ, గత రెండేళ్లలో ఆయనకు స్పష్టమైన పాత్ర ఏదీ కేటాయించకపోవడంతో ఆయన కూడా జట్టు నుంచి వైదొలగడానికే మొగ్గు చూపారు.
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
టి. దిలీప్: ఒక సీనియర్ స్టార్ ఆటగాడి కోరిక మేరకు దిలీప్‌కు గతంలో ఏడాది పాటు కాంట్రాక్ట్ పొడిగించినప్పటికీ, ఆయన పనితీరు పట్ల బిసిసిఐ సంతృప్తిగా లేదు. ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ఫీల్డింగ్ పరంగా జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు రానున్నారు?
కొత్త ఫీల్డింగ్ కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ ప్రస్తుతం 2 నుంచి 3 మంది అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో రాహుల్ ద్రావిడ్ కాలం నుంచి పనిచేస్తున్న అస్సాంకు చెందిన శుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. త్వరలోనే బిసిసిఐ కొత్త కోచింగ్ సిబ్బందిని అధికారికంగా ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?