Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ . రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటన సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
సాధారణంగా సినిమాల ట్రైలర్లను సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో విడుదల చేస్తుంటారు. కానీ, ఈసారి సంప్రదాయానికి భిన్నంగా సరికొత్త సంచలనానికి తెరతీశారు. అత్యంత పవిత్రమైన బ్రహ్మ ముహూర్త వేళ, గురువారం (జూలై 30) తెల్లవారుజామున సరిగ్గా 4:15 AM IST గంటలకు ఈ రామాయణ దృశ్యకావ్య ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ వంటి సంగీత మాంత్రికులు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండటం విశేషం. ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లో అలరించనున్న ఈ విజువల్ వండర్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెల్లవారుజామున 4:15 గంటలకే రాబోతున్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఎలాంటి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి!
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?