Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. మంగళవారం కోరమంగళ ప్రాంతంలో పెయింగ్ గెస్ట్ హాస్టల్‌లో 22 ఏళ్ల యువతి గొంతుకోసి హత్య చేయబడింది. మృతురాలని బీహార్‌కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తు్న్న బాధితురాలు కోరమంగళలోని వీఆర్ లేఅవుట్‌లోని హాస్టల్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఓ వ్యక్తి హాస్టల్‌లో ప్రవేశించి కత్తితో దాడి చేశాడు.
Read Also: Beerla Ilaiah : మంత్రివర్గమంతా దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాం
మూడో అంతస్తులో ఉన్న కృతి కుమారిపై నిందితుడు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమాతో పాటు కోరమంగళ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తునున్నారు. పరిచయస్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
డీసీపీ సారా ఫాతిమా మాట్లాడుతూ.. నిందితుడు ఆమె ఉంటున్న వసతి గృహంలోకి ప్రవేశించి, ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించింది. హత్య వెనక ఉన్న కారణాలపై మేము దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడిని గుర్తించాము, అతడిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము అని అన్నారు.