మధ్యప్రదేశ్‌లోని హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. ఆస్తికోసం తన తల్లిని మట్టుబెట్టాడు ఓ కిరాతక కుమారుడు. రాష్ట్రంలోని భింద్‌లో 95 ఏళ్ల వృద్ధ తల్లిని ఆమె కొడుకు.. భార్య, మనవడితో కలిసి హత్య చేశాడు. వృద్ధురాలి కొట్టడానికి ముందు జరిగిన వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన భింద్‌లో అంతా ఖేరోలి గ్రామంలో చోటుచేసుకుంది.
READ MORE: CM Revanth: ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ..
విషయమేమిటంటే.. 95 ఏళ్ల వృద్ధురాలు సుఖ్‌దేవి కొద్దిరోజుల తన పెద్ద కొడుకు కళ్యాణ్‌తో నివసిస్తున్నారు. ఇటీవల ఆమెను చిన్న కుమారుడు కాళీచరణ్ తన ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాళీచరణ్, అతని భార్య లీలా, కుమారుడు ముఖేష్ ఆస్తుల విభజనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుఖ్ దేవితో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీడియోలో..కాళీచరణ్ మరియు అతని భార్య లీలా ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. సుఖ్ దేవి దగ్గరలోని మంచం మీద పడుకుని ఉంది. సుఖ్ దేవి మోచేయిపై గాయాలు కనిపిస్తున్నాయి. వీడియోలోనే.. లీలా తన చేతుల్లో కర్రను పట్టుకుని కూడా కనిపిస్తుంది. అతడు విపరీతంగా దుర్భాషలాడినట్లు వీడియోలో చూడవచ్చు.
READ MORE:Stock Market vs SIP: స్టాక్ మార్కెట్ లేదా ఎస్ఐపీలో ఎందులో పెట్టుబడి ఉత్తమం..
ఆస్తి వివాదంపై ఇంట్లో గొడవ ఎంతగా పెరిగిపోయిందంటే కాళీచరణ్, అతని భార్య లీలా, కాళీచరణ్ కొడుకు ముఖేష్ కలిసి 95 ఏళ్ల సుఖ్‌దేవిని తీవ్రంగా కొట్టారు. దీంతో సుఖ్‌దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న పెద్ద కుమారుడు కళ్యాణ్ ఇంటికి చేరుకుని సుఖ్‌దేవిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా.. సుఖ్‌దేవి మృతి చెందింది. ఈ విషయమై బారాసన్ పోలీస్ స్టేషన్‌లో కాళీచరణ్, లీలా, కుమారుడు ముఖేష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.