AP Crime News: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు దేహదాహానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇక మరో ఘటన సైతం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నంకి పాల్పడ్డాడు.
Also Read: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ
వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. ప్రకాశం జిల్లా అయిన టంగుటూరులో ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయంలో బాలిక తన ఇంట్లో చదువుతూ ఉండగా చాటుగా వచ్చి అత్యాచారం చేయబోయాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.