Rahul Gandhi: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, వారి ఇద్దరు మహిళా స్నేహితులపై జరిగిన దాడి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, వారి గర్ల్ ఫ్రెండ్స్‌లో ఒకరిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బుధవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇద్దరు యువ ఆర్మీ అధికారు విహారయాత్రకు వెళ్లారు. అయితే, నేరస్తులు ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, అందులో ఒక మహిళపై అత్యాచారం చేశారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్ఫాంట్రీ స్కూల్లో యంగ్ ఆఫీసర్స్(వైఓ) కోర్సు చదువుతున్న 23, 24 ఏళ్ల అధికారులు తమ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ కోసం వెళ్లినప్పుడు ఘటన జరిగినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్…
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది.
UP News: ఉత్తర్ ప్రదేశ్‌లో వరసగా సమాజ్‌వాదీ(ఎస్పీ) నేతలు అత్యాచారం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఎస్పీకి చెందిన సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్ ఓ మహిళా లాయర్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు లాయర్ అతడి దగ్గర సహయకురాలిగా పనిచేసేది.
దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.
Gujarat: గుజరాత్లో దారుణం జరిగింది. మనవడిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాల్సిన బామ్మే కసాయిగా మారింది. 14 నెలల చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి చంపింది. రాష్ట్రంలోని అమ్రేలి తాలుకాలో ఈ ఘటన జరిగింది. నిందితురాలైన మహిళ మనవడు నిరంతరం ఏడుస్తున్నాడనే కోసంతో అతడిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Karnataka: కర్ణాటకలో బీదర్‌లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.