సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు.
మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలతో భార్య హత్య చేసినట్లు గుర్తింపు. పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవవి. అస్సాంకు చెందిన రుక్సానా(35) భర్తతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉండేవారు.
Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్‌లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.
రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
UP News: ఉత్తర్ ప్రదేశ్ హర్దోయ్‌లో దారుణం జరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తా అని పట్టుబట్టడంతో ఓ భర్త, భార్యపై దారుణానికి ఒడిగట్టాడు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశం అంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా ఉన్నట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను మరవకముందే తమిళనాడులో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించి.. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో పాటు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఆగస్టు మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా…
Moradabad Girl Gang Raped in Uttarakhand Bus Stand: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్టాండ్‌లోని ఓ దుకాణం కాపలాదారు బాలిక దీన స్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆగష్టు 12న చోటుచేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. సీసీటీవీ ద్వారా దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్…
మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు.