Mumbai: ప్రేమ పెళ్లి చేసుకున్న జంట.. విడాకులు తీసుకున్న మహిళ.. యాసిడ్ పోసిన భర్త..!
- ముంబైలో భార్యపై యాసిడ్ తో దాడి చేసిన భర్త..
- అక్రమ సంబంధం గురించి తెలుసి విడాకులు తీసుకున్న భార్య..
- చికిత్స పొందుతున్న భార్య.. నిందితుడి కోసం పోలీసుల గాలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2019 లో ప్రేమ వివాహం చేసుకున్నారు ఓ జంట. పెళ్లైన తర్వాత భర్తకు ఉద్యోగం లేకపోవడంతో పాటు డ్రగ్స్‌కు బానిసగా మారి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్య గుర్తించింది.
Read Also: Gold Rate Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. ఆల్‌టైమ్ గరిష్టాలను దాటేసిన గోల్డ్ రేట్లు!
Also Read
ఈ విషయంపై గట్టిగా అతడ్ని ప్రశ్నించగా పలుమార్లు ఇరువురు మధ్య గొడవ జరిగింది. కానీ, సదరు భార్య భర్తతో నాలుగు నెలల క్రితం విడాకులు తీసుకుని తన తల్లితో కలిసి మలాడ్‌లో జీవనం కొనసాగిస్తుంది. అయితే, బుధవారం (సెప్టెంబర్ 25) ఉదయం ఆమె భర్త బలవంతంగా ఇంట్లో్కి వచ్చి.. ఆమెపై యాసిడ్ పోశాడు.. దీంతో తీవ్ర గాయాలు కావడంతో కూపర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రస్తుతం తీవ్రమైన కాలిన గాయాలకు చికిత్స పొందుతుంది.
Read Also: MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
ఈ సంఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై 124(2), 311, 333, 352 సహా భారతీయ నయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.
- Tags
- acid
- Crime News
- Divorce
- Man
- mumbai
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?