హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్‌షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. Read Also: పబ్జీ గేమ్…
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్దుమా మెట్రో స్టేషన్ సమీపంలో గల రిషబ్ టవర్లోని 6వ అంతస్థులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు 14 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే కాలుష్యపు పొగమంచుతో నిండిన ఢిల్లీలో ఈ ఘటనతో మరింత పొగ అలుముకుంది.
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దోమలగూడ లో నివాసముంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. నిన్న బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇండ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. అయితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న భార్గవికి సంవత్సరం క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో…
కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. వావివరుసలు లేని ఒక మృగాడు.. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందులోను ఆమె కొడుకు ప్రియురాలని తెలిసినా నీచానికి ఒడిగట్టాడు. ప్రియుడి కోసం ఇంటికి వచ్చిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. బాలే హెన్నూరు పరిధిలో నివాసముంటున్న ఒక బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు గతకొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలిక ఇంటికి యువకుడు వెళ్లివస్తూ ఉంటాడు.. ఈ నేపథ్యంలోనే బాలిక…
తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరోసారి డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోటోస్ ఫ్రేమ్ వెనుక డ్రగ్స్ పెట్టి పార్శిల్స్ చేసి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేటలో ఇంటర్ నేషనల్ పార్శిల్స్ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ…
మనిషి అన్న ప్రతివాడు తప్పులు చేస్తాడు. కొన్ని సరిదిద్దుకోలేని.. కొన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నించినా కాలేనివి.. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోతే వినాశనం తప్పదు. ఒక యువతి తాను చేసిన తప్పును సరిద్దిదుకోకపోవడం వలన ఆమె జీవితం ప్రస్తుతం అగాధంలోకి కూరుకుపోయింది. నమ్మినవాడు మోసం చేశాడు. కట్టుకున్నవాడు వదిలేశాడు.. చివరికి ఏమిచేయలేని నిస్సహాయక స్థితిలో పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక యువతి(20)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతిచెందారు. ఒంటరిగా పెరుగుతున్న ఆమె జీవితంలోకి ఒక…
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో జరిగిన ప్రమాదంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ స్పందించారు. ఎస్ఆర్పీ-3,3ఎ ఇంక్లైన్ ప్రమాదంలో కార్మికుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా సింగరేణి ఉంటుందని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గని ప్రమాద మృతులకు కంపెనీ…
తెలంగాణలో మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాద మోపుతున్నారు. అడుగడునా తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం నజీరాబాద్ తండాలో ఓ రైతు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు పత్తిపంటలో గంజాయి సాగు చేస్తున్న రైతును అరెస్టు చేశారు. అంతేకాకుండా సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ యువకుడు ఆంటీ కోసం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ పెళ్లయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇది వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ 20 రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేశారు. Read Also: ఆర్టీసి కీలక నిర్ణయం: ఉదయం 4 గంటల నుంచే సిటీ సర్వీసులు ఈ ఘటనలో మహిళ…