మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఖైరతాబాద్‌లో జరుగుతున్న సదర్ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారు తలసాని సాయికిర్‌ణ్ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్‌కు చెందిన సంతోష్ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో సదరు బాధితుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తలసాని సాయికిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు…
ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జైలు రణరంగంగా మారింది. తోటి ఖైదీ మరణించిన వార్త విన్న ఖైదీలు ఆవేశంతో జైలు సిబ్బందిపై దాడికి దిగి జైలుకు నిప్పుపెట్టారు. అంతేకాకుండా జైలర్‌ను నిర్బంధించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సందీప్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా జైలులో ఉన్నాడు. ఈ మధ్య సందీప్ డెంగీ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో సైఫాయి ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈనేపథ్యంలో సైఫాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించారు. ఈ…
బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఓ ప్రయాణికుడు సినిఫక్కిలో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసి కస్టమ్ అధికారులకు దొరికిపోయాడు. అబుదాబి నుంచి చైన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి సన్నటి వైర్లుగా తయారు చేసి లగేజ్ ట్రాలీ బ్యాగ్ సైడ్ లో వున్న రాడ్స్ లో అమర్చాడు. ఆ బంగారాన్ని దర్జాగా తరలించేందుకు ప్రయత్నించగా చైన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు చేసిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయట పడింది. దీంతో…
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి తరువాత కూడా ఇద్దరు స్నేహాన్ని కొనసాగించారు. పెళ్లి తరువాత భార్యకు కూడా తన స్నేహితుడిని పరిచయం చేశాడు. బాధ స్నేహితుడు అని ఆమె కూడా కలివిడిగా మాట్లాడింది. దీంతో ముగ్గురు మంచి స్నేహితులయ్యాం అని ఆ భర్త ఎంతో సంతోషించాడు. కానీ స్నేహితుడని నమ్మి ఇంటికి పిలిస్తే భార్యపైనే కన్నేశాడు దుర్మార్గుడు. చివరికి భార్య కూడా భర్తను కాదని అతడి స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది.…
ఆఫ్రికా దేశంలోని సియర్రా లియోన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 91 మంది మృతి చెందగా 100 మంది గాయాలయ్యాయి. సియర్రా లియోన్‌లోని ఫ్రీటౌన్‌లో ఓ లారీని చమురు ట్యాంకర్ ఢీ కొట్టింది. దీంతో ఆ వాహనాలను అక్కడే ఉంచారు. చమురు ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండడంతో చమురు కోసం స్థానిక జనాలు ఎగబడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చమురు ట్యాంకర్లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. దీంతో 91 మంది మంటల్లో చిక్కుకొని…
ఒక ప్రేమ జంట చేసిన ఒక పని నలుగురు ప్రాణాలు తీసింది.. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు.. బంధువుల పంక్షన్ లో ఒక బాలికను చూసి ఇష్టపడ్డాడు. కొద్దిరోజులు ఆమె వెనక తిరిగి ప్రేమ గురించి చెప్పాడు.. బాలిక కూడా ఒప్పుకోవడంతో కొన్నిరోజులు చెట్టాపట్టాలేసుకున్న జంట.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంట్లో పారిపోయారు. బాలిక తన…
కామాంధులు రోడురోజుకు పేట్రేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ..చిన్నారులను కూడా వదలకుండా చిదిమేస్తున్నారు. తాజాగా ఒక గ్రామ వాలంటీర్, ఒక బాలికకు మాయమాటలు చెప్పి సచివాలయంలోనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. . వీరఘట్టం మండలం నడుకూరు సచివాలయంలో బొత్స హరిప్రసాద్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. సచివాలయం ఆదివారం మూసివేయాలి.. కానీ, హరిప్రసాద్ మాత్రం సచివాలయాన్ని తెరిచి పాడుపనులు చేస్తున్నాడు. గత నెల 31 వ తేదీన ఒక బాలికను మాయమాటలు చెప్పి సచివాలయానికి తీసుకొచ్చాడు.…
ఏపీలో గంజాయి పట్టివేత నిత్యకృత్యంగా మారింది. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడోచోట భారీగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా మంగళగిరిలో మరోసారి గంజాయి రవాణా తతంగం బయట పడింది. మంగళగిరిలోని కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనఖీ చేస్తుండగా ఓ కారులో 50 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. దీంతో డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. విశాఖ నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే ఈ…
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు,…