షాద్‌నగర్ రైల్వేస్టేషన్లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్‌నగర్‌లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది.…
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లి శవంతో అక్క నాలుగురోజులుగా సహజీవనం చేస్తోంది. చెల్లి మృతి చెందినట్లు ఎవరికి తెలియనివ్వకుండా ఆమె శవం వద్దే కూర్చొని విలపిస్తోంది. చివరికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూడడం విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం తల్లి చనిపోగా తండ్రి ఇద్దరు కూతుళ్లను…
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. ముగ్గురు పిల్లల్తో కలిసి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యను వివాహేతర సంబంధం వలనే అతడు ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం గోకవరంకు చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వంగలపూడికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. సదురు వ్యక్తి ఆటో నడుపుతుండగా.. భార్య కువైట్ వెళ్లి పనిచేస్తోంది. దీంతో పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలను…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది చింతపల్లి నరబలి కేసు. నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగిన ఈ ఘోరంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా నిందితులు ఇంకా దొరకలేదు. ఎవరు హత్య చేశారు? లేకపోతే నరబలి ఇచ్చారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు కష్టంగా మారింది కేసు. తెలిసిన వ్యక్తులతో పాటు అనుమానంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కొద్దిరోజుల క్రితం చింతపల్లి మహంకాళి విగ్రహం…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు.…
రాజేంద్రనగర్‌లో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అత్తాపూర్ చింతల్మెట్లోని మెఘల్ మెడోస్ అపార్ట్మెంట్లో ఓఫ్లాట్‌లో బ్యూటీషియన్ పనిచేసే సుమేరా బేగం అనే యువతి నివాసం ఉంటుంది. అయితే సదరు యువతి ఉంటున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ లోపలికి వెళ్లి చూడడంతో సుమేరా బేగం చున్నీ ప్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవని కనిపించింది. అయితే…
రెండు తెలుగు రాష్ట్రాల్లో…సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ.. ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే.. గాలిపటం ఎగురు వేస్తున్న నేపథ్యంలో… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 12 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ఓ గాలిపటం. గాలిపటం ఎగుర వేస్తుండగా… కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు కరెంటు పోల్ ఎక్కాడు ఆ 12 ఏళ్ల బాలుడు.…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి… బర్కత్‌పురలోని గోకుల్ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరూ కలిసి…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాని అనే గర్భిణీని వైద్యం కోసం చౌటుప్పల్‌లోని ప్రశాంతి ప్రైవేటు ఆసుప్రతికి కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు. అయితే వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ శివాని మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆస్పత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై కేసు…
శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి…