ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో ఇటీవల యువత రకరకాల స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా ఇద్దరు యువకులు ఏకంగా పోలీస్ వాహనంపై కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన వీడియో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.
విశాఖ పట్నం బీచ్ రోడ్డులో కలకలం రేపిన వివాహిత శ్రావణి మర్డర్ కేసును పోలీసులు చేదించారు. సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో బీచ్ రోడ్డు వద్ద మహిళ డెడ్ బాడీని గుర్తించామని క్రైమ్ డీసీపీ విద్యాసాగర్ నాయుడు చెప్పుకొచ్చారు.
Madhya Pradesh : నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మర్చిపోయి పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. తండ్రి కూతురు మీద, మామ కోడలు మీద, ఇంటి పక్కన ఉండే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొన్ని చోట్ల అభంశుభం తెలియని చిన్నారులపై కూడా దాడులు చేసి కామవాంచలను తీర్చుకుంటున్నారు.
డబ్బుల కోసం కుటుంబాన్నే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌కు బానిసైన 24 ఏళ్ల యువకుడు తన తండ్రి డబ్బులు ఇవ్వలేదని.. తన తల్లిదండ్రులు, నానమ్మను చంపి వారి మృతదేహాలను కాల్చివేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కా గ్రామంలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని విల్లుపురం జిల్లా , చెంగల్పట్టు జిల్లాల్లోని సంభవించిన కల్తీ మద్యం మరణాల సంఖ్య బుధవారానికి 21కి చేరింది. ఈ కల్తీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొంత మంది అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికాలో భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల లహరి పతివాడ.. ఐదు రోజుల క్రితం విధులకు వెళ్తూ అదృశ్యమయ్యారు. ఆ మరుసటి రోజే టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఒక్లహోమా రాష్ట్రంలో శవమై కనిపించారు.