Sravana Sandhya Cheated Boys In The Name Of Marriage: ఓవైపు అమ్మాయిల్ని ప్రేమ పేరుతో కిలాడీలు మోసం చేస్తుంటే.. మరోవైపు పెళ్లి పేరుతో అబ్బాయిల్ని కిలేడీలు దోచేసుకుంటున్నారు. మాయమాటలతో తమ ముసుగులో దింపి, ఆయా ఆర్థిక అవసరాలు తీర్చుకొని, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేస్తున్నారు. కంటికి కనిపించకుండా మాయమైపోతున్నారు. తమ పరువు పోతుందన్న భయంతో, చాలామంది అబ్బాయిలు కిలేడీలపై ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉండిపోతున్నారు. అయితే.. ఓ యువకుడు మాత్రం ఇతరుల్లాగా సైలెంట్‌గా ఉండలేకపోయాడు. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఫిక్సయి, మోసం చేసిన కిలేడీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి వాళ్లు ఆ కిలేడీని పట్టుకొని, అతనికి న్యాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Malladi Vishnu: వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కి లేదు.. మల్లాది విష్ణు ఫైర్
చెన్నైలోని అయ్యపాక్కం కాల్‌సెంటర్‌లో అశోక్ చైతన్య (33) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం నుంచి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇతను.. ఓ మేట్రిమోనీ సంస్థలో తన పేరుని నమోదు చేసి, వధువు కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అశోక్‌కి మదనపల్లెకు చెందిన శ్రావణ సంధ్య అనే యువతి పరిచయం అయ్యింది. అయితే.. ఆ యువత తన వాస్తవ ఫోటోలను పెట్టలేదు. ఓ అందమైన మోడల్ ఫోటోల్ని పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా ఆ మోడల్ ఫోటోలనే అప్‌లోడ్ చేసింది. ఆ ఫోటోలు చూసి ముగ్ధుడైన అశోక్.. ఆమెతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మెల్లగా తన మాయమాటలతో ఆ యువతి అశోక్‌ని బుట్టలో పడేసింది. ఇక చేప గాలంలో చిక్కుకున్నాక.. తన అవసరాల కోసం సొమ్ము అడగడం ప్రారంభించింది. ఎలాగో తనకు కాబోయే భాగస్వామినే కదా అనే ఉద్దేశంతో.. అశోక్ ఆమె అడిగినంత సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేసేవాడు. ఒక విలువైన సెల్‌ఫోన్ కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడు. ఇలా అశోక్ ఆమెకు రూ.9 లక్షల దాకా ముట్టజెప్పాడు.
Cruel Father: ఛీ వీడు అసలు తండ్రేనా? భార్యపై అనుమానంతో ఇద్దరు బిడ్డలను చంపి..
ఇంకెన్నాళ్లు ఇలాగే కాలక్షేపం చేయాలనుకొని.. ఒకరోజు అశోక్ మనం పెళ్లి చేసుకుందామని సంధ్యకు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌తో ఖంగుతిన్న ఆమె.. అతడ్ని మెల్లగా దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అదిగో, ఇదిగో అంటూనే.. అతడ్ని నంబర్‌ను ఫోన్‌లో బ్లాక్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతని ఖాతాల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో.. తాను మోసపోయానని గ్రహించిన అశోక్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ నంబర్లు, ఫేస్‌బుక్ చాటింగ్‌ల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు సంధ్య బెంగళూరులో ఉందని గుర్తించి, ఆమెని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని విచారంచగా.. గతంలో ఇదే తరహాలో ఆమె కొందరు యువకుల్ని పెళ్లి చేసుకుంటానని ఆశజూపి, లక్షలకు లక్షలో దోచేసిందని వెల్లడైంది. కోర్టులో హాజరుపరచి, ఆమెని జైలుకు తరలించారు.